క్రైమ్
గచ్చిబౌలి స్టార్ హోటల్‌లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి!
హైదరాబాద్ మహానగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతమైన గచ్చిబౌలిలో అత్యంత దిగ్భ్రాంతికి గురిచేసే ఘటన వెలుగుచూసింది. వ్యాపార పనుల నిమిత్తం నగరానికి వచ్చిన 41ఏళ్ల అమెరికా పౌరుడు తాను బస చేసిన స్టార్ హోటల్ గదిలోనే అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గచ్చిబౌలి పరిధిలోని ఎస్ఎల్‌ఎన్ (SLN) టెర్మినస్‌లో ఉన్న మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో శనివారం ఈ విషాద పరిణామం చోటుచేసుకుంది.
