తెలంగాణ
గద్వాల మున్సిపాలిటీలో ముగ్గురు ఉద్యోగులపై వేటు
Gadwal: గద్వాల మున్సిపాలిటీలో మున్సిపల్ షాపుల అద్దెల రూపంలో వసూలైన రూ.11.28 లక్షలను ఖాతాలో జమ చేయకపోవడం, నిధుల దుర్వినియోగం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో అద్దె వసూళ్లు చేయించిన వ్యవహారంలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు ఆర్వో రాజేష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్/ఇంచార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజవర్ధన్, జూనియర్ అసిస్టెంట్/ ఇంచార్జ్ ష్రాఫ్ రాజవర్ధన్ నాయుడులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
