National

ఉత్కంఠకు తెర.. ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ సభకు అనుమతి!

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించతలపెట్టిన 'ఛాత్రోన్ కీ గూంజ్' (విద్యార్థుల గళం) సదస్సుకు ఏర్పడిన ఆటంకాలు ఎట్టకేలకు తొలగిపోయాయి. సభా వేదిక అయిన కేపీ గ్రౌండ్‌కు గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేసి తీవ్ర రాజకీయోత్కంఠకు కారణమైన కాయస్థ పాఠశాల (కేపీ) ట్రస్ట్ గురువారం అర్ధరాత్రి వెనక్కి తగ్గింది. కొన్ని కఠినమైన షరతులతో సభ నిర్వహణకు తిరిగి అనుమతి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.