తెలంగాణ
బాలాపూర్ లడ్డును మించి.. వేలంలో రూ.1.01కోట్లు పలికిన గణేశ్ లడ్డు!
హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ పరిధిలో ఉన్న ప్రముఖ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో వినాయక చవితి వేడుకల సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం నగరంలోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 5 కిలోల పవిత్రమైన గణేష్ లడ్డూ ప్రసాదం వేలంలో ఊహించని రీతిలో భారీ ధరను పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్థానిక నివాసితులు ఎంతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో, భక్తిప్రపత్తులతో ఈ వేలం పాట పోటీలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీ పడ్డారు. ఈ పోటీలో విల్లాస్‌కు చెందిన కొందరు నివాసితులు ప్రత్యేక బృందంగా (సిండికేట్) ఏర్పడి, ఉమ్మడిగా రూ.1.01కోట్ల భారీ మొత్తాన్ని వేలం పాడి ఈ పవిత్ర లడ్డూను సొంతం చేసుకున్నారు.
