National
Supreme Court: నీట్ విద్యార్థులకు ఊరట.. కేసుల ఎత్తివేతకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులకు సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
