సినిమా

Sukumar: RC 17 ఫైనల్ నరేషన్‌కి రెడీ..చరణ్ ఛేంజస్ చెప్పకపోతే డిసెంబర్ నుంచే..

Sukumar: పుష్ప ఫ్రాంఛైజీస్‌తో రాజమౌళి రేంజ్‌లో పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ అండ్ మార్కెట్‌ను సంపాదించుకున్నాడు సుకుమార్. ఇప్పుడు, ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. తాజా సమాచారం మేరకు ఆర్సీ 17 ఫుల్ స్క్రిప్ట్ లాకైనట్టుగా తెలుస్తోంది. చరణ్ అపాయింట్మెంట్ ఇవ్వగానే సుక్కూ ఫైనల్ నరేషన్ ఇవ్వనున్నాడు.