సినిమా

S.S.Rajamouli: సూర్య-అల్లు అర్జున్‌లలో రాజమౌళి హీరో ఎవరు?

సూర్య కొన్నేళ్ళ నుంచి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఒకసారి ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిందని చాలా సందర్భాలలో చెప్పాడు. ఇక, పుష్ప సిరీస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్‌గా పెరిగిన క్రేజ్ అసాధారణం. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ సూర్య, అల్లు అర్జున్‌ల కోసం కథలు సిద్ధం చేస్తున్నారట. వారణాసి రిలీజ్ తర్వాత గ్యారెంటీగా వీరిలో ఒకరు జక్కన్నతో సినిమాను చేయడానికి రెడీ అవుతారని తెలుస్తోంది.