ఏపీ

ఇంద్రకీలాద్రిపై శ్రావణ శోభ.. కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త రూల్స్!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస ఆధ్యాత్మిక ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసపు తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు ఆధ్యాత్మిక శోభతో కిక్కిరిసిపోయాయి. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని దుర్గమ్మ ఆలయంలో నెలాఖరు వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు.