Spirituality
Spirituality: ప్రతి రోజూ దైవస్మరణ ఎందుకు.. దైవ పూజ ఎప్పుడు చేయాలి!..
మనిషి జీవితంలో దైవస్మరణకు సమయం అంటూ ప్రత్యేకమైన ముహూర్తం అవసరం లేదు. సుఖంలో ఉన్నా.. దుఃఖంలో ఉన్నా.. సంపద ఉన్నా.. సమస్యలు ఎదురైనా.. దైవాన్ని స్మరించడం భారతీయ సంప్రదాయంలో జీవన విధానంగా భావించారు. ఎందుకంటే పూజ అనేది కష్టాలను తొలగించుకోవడానికి మాత్రమే చేసే ప్రార్థన కాదు.. మనిషి తన కర్మను పవిత్రం చేసుకునే సాధన..
వేదాంత సంప్రదాయం మనిషి జీవితాన్ని కర్మతో విడదీయరాని బంధంగా చూస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మ, కర్తవ్యబోధ, యజ్ఞభావనలను వివరిస్తూ.. ఫలితంపై మాత్రమే ఆసక్తి పెట్టకుండా ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఉపదేశిస్తాడు. అంటే దైవారాధన అనేది ఆలయంలో దీపం వెలిగించడంతో ముగిసిపోదు. మనం చేసే ప్రతి పనిలో ధర్మాన్ని నిలబెట్టడం కూడా దైవపూజలో భాగమే.
