Spirituality

శివారాధనలో మొగలి పువ్వు ఎందుకు నిషేధం?..

శివారాధనలో మొగలి పువ్వుకు ఎందుకు స్థానం లేదని చెబుతారు.. పురాణగాథ ప్రకారం.. బ్రహ్మ, విష్ణువుల మధ్య గొప్పతనంపై వివాదం వచ్చినప్పుడు, అనంతమైన అగ్నిస్తంభంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు సత్యాన్ని అంగీకరించగా.. బ్రహ్మ అసత్యానికి మొగలి పువ్వును సాక్షిగా నిలబెట్టాడు. దీంతో శివుడు బ్రహ్మ అహంకారాన్ని, మొగలి పువ్వు అసత్యాన్ని తిరస్కరించాడు. అందుకే ఈ కథ మనకు చెప్పే సత్యం ఒక్కటే.. పూజలో పుష్పం కంటే పవిత్రమైనది మనసు. అలంకారం కంటే నిజాయితీ గొప్పది. అహంకారాన్ని విడిచి సత్యాన్ని ఆశ్రయించినప్పుడే శివతత్త్వానికి చేరువవుతాం.