Spirituality
గణపతి పండుగ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని ఎందుకు చెబుతారు?
వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం వల్ల నీలాపనిందలు వస్తాయని గణేశ పురాణం, ఇతర సంప్రదాయ కథనాల్లో చెప్పబడింది. అసలు దీనికి కారణమేంటి అంటే.. ఒకసారి గణపతి తన భక్తుల ఇళ్లకు వెళ్లి పూజలు స్వీకరించి, ప్రసాదాలు స్వీకరిస్తూ రాత్రివేళ తన వాహనమైన మూషికంపై తిరిగి వస్తుండగా, ఆయనను చూసిన చంద్రుడు గణపతి రూపాన్ని చూసి పరిహాసంగా నవ్వాడని పురాణ కథనం. చంద్రుడి అందం, గర్వానికి ప్రతీకగా భావిస్తారు. ఆ గర్వంతో గణపతిని అవహేళన చేయడంతో వినాయకుడు చంద్రుడిని శపించాడని కథ చెబుతుంది. ఆ శాపంలో భాగంగానే చంద్రుడిని చూసినవారిపై నిందలు పడతాయని పురాణాలు వివరిస్తాయి.
