Spirituality

యజ్ఞం చేయడంలో ఉన్న రహస్యం ఏమిటి?..

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో యజ్ఞం అంటే కేవలం అగ్నిలో ఆహుతులు సమర్పించే ఒక క్రతువు మాత్రమే కాదు.. మనలోని స్వార్థాన్ని దహించి, సమస్త లోక క్షేమాన్ని కోరే ఒక మహోన్నత ఆధ్యాత్మిక సాధన.మన సంస్కృతిలో గాయత్రిని తల్లిగా, యజ్ఞాన్ని తండ్రిగా భావించే సంప్రదాయం ఉంది. గాయత్రీ ఉపాసనలోనూ యజ్ఞానికి ప్రత్యేక స్థానం ఉంది. మంత్రజపం ద్వారా మనస్సును పవిత్రం చేసుకుంటే.. యజ్ఞం ద్వారా ఆ సాధనను విశ్వశక్తికి సమర్పించే భావన ఏర్పడుతుంది.

అగ్నికి సమర్పించే ప్రతి ఆహుతి వెనుక ఒక గొప్ప తాత్విక సందేశం దాగి ఉంది. మనకు లభించినది ప్రకృతి ప్రసాదమేనని గుర్తించి.. దానిలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి, ప్రకృతికి, దైవానికి సమర్పించడమే యజ్ఞ తత్వం.వేద సంప్రదాయంలో యజ్ఞం కేవలం వ్యక్తిగత శ్రేయస్సు కోసం మాత్రమే కాదు.. కుటుంబం, సమాజం, ప్రకృతి, సమస్త జీవుల క్షేమాన్ని కోరుతూ నిర్వహించే పవిత్ర కర్మగా భావించబడింది.