Spirituality

నారాయణ అనే నామానికి ఉన్న శక్తి ఏమిటి?..

ఓం నమో నారాయణాయ. లేదా నారాయణ అనే నామం కేవలం ఒక నామం కాదు... అది ఈ సమస్త బ్రహ్మాండాన్ని నడిపించే ఒక మహా శక్తి... శాస్త్రాల ప్రకారం, 'నార' అంటే జీవాత్మలు లేదా ఆపోమూర్తి అయిన జలం. 'అయన' అంటే ఆశ్రయం లేదా గమ్యస్థానం. అంటే, విశ్వంలో ఉన్న సమస్త జీవులకు ఏది పరమ ఆశ్రయమో, ఏ శక్తిలో సకల ప్రాణులు అంతిమంగా లీనమవుతాయో... అదే 'నారాయణ తత్త్వం అని శాస్త్రాలు చెబుతున్నాయి.