Spirituality

కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది అంటారు.. ఎందుకు?

కాలం కూడా మోకరిల్లే పవిత్ర క్షేత్రం కాశీ.. కాశ్యాం తు మరణాన్ముక్తిః అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని మన సనాతన ధర్మం, వేద శాస్త్రాలు తెలియచేస్తున్నాయి.. శాస్త్రాల ప్రకారం, కాశీ కేవలం భూమి మీద ఉన్న నగరం కాదు. ఇది పరమశివుని త్రిశూలం యొక్క కొనపై నిలిచి ఉన్న దివ్య క్షేత్రం. కాశీ మహాక్షేత్రంలో ఒక జీవి తన చివరి శ్వాస విడిచే సమయంలో, స్వయంగా ఆ కాశీ విశ్వనాథుడే అక్కడ ప్రత్యక్షమవుతాడు. మరణించే జీవి కుడిచెవిలో సాక్షాత్తు పరమశివుడే "తారక మంత్రాన్ని" ఉపదేశిస్తాడు.. ఆ క్షణంలో, జన్మజన్మల నుండి ఆ జీవి వెంట వస్తున్న పాపపుణ్యాల సంకెళ్లు, కర్మబంధాలన్నీ ఒక్కసారిగా భస్మమైపోయి.. జనన మరణ చక్రం నుండి విముక్తి లభించి, ఆ ఆత్మ సాక్షాత్తు పరమశివుని సాన్నిధ్యాన్ని లేదా సాయుజ్య ముక్తిని పొందుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం..