Spirituality

మనిషి జీవితాన్ని నడిపించే మార్గదర్శి భగవద్గీత.. నేటి సమాజానికి బోధించే జ్ఞానం ఏమిటి!..

మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంతోషం, బాధ, విజయం, అపజయం, కోపం, ఆందోళన... ఇలా ఎన్నో అనుభవాల మధ్య మనిషి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. కానీ ఈ ప్రయాణంలో మనసుకు ప్రశాంతతను, జీవితానికి సరైన దిశను చూపించే జ్ఞానం భగవద్గీతలో దొరుకుతుంది.. వేదాలు, శాస్త్రాలను అధ్యయనం చేసిన పండితులు చెబుతున్న సమాధానం ఇదే.. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి మనసులో కలిగిన సందేహం కేవలం అతనిదే కాదు. నేటి మనిషి ఎదుర్కొంటున్న అనేక ప్రశ్నలకు కూడా అది ప్రతిబింబమే. ఏది చేయాలి? ఏది చేయకూడదు? విజయం రాకపోతే? మనం అనుకున్నది జరగకపోతే? ఇలాంటి సందేహాల మధ్య శ్రీకృష్ణుడు అర్జునుడికి అందించిన జ్ఞానమే ఈ గీత.