Spirituality

సృష్టిలో ఏదీ సంపూర్ణం కాదు.. ఇదే సృష్టికర్త ఇచ్చిన గొప్ప సందేశం!

సృష్టిలో ప్రతి వరంతో పాటు ఒక చిన్న లోటు కూడా ఉంటుంది. చెరకుకు తీపి ఉంది.. కానీ పండు లేదు. బంగారానికి మెరుపుంది.. కానీ సువాసన లేదు. సూర్యుడికి వెలుగు ఉంది.. కానీ చల్లదనం లేదు. చంద్రుడికి చల్లదనం ఉంది.. కానీ సూర్యుడి తేజస్సు లేదు. ఇదే సృష్టికర్త మనిషికి చెప్పే గొప్ప సత్యం. ఈ లోకంలో ఏదీ సంపూర్ణం కాదు.. ప్రతి బలానికి ఒక పరిమితి ఉంటుంది. కాబట్టి మనిషి తన గొప్పతనాన్ని చూసి గర్వపడకుండా.. తన లోటును గుర్తించి వినయంగా జీవించాలి. లభించిన వరాలకు కృతజ్ఞత.. లోటులకు అంగీకారం.. ఇదే నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వత.