Spirituality
ప్రతి మాటా బీజాక్షరమే.. మన వాక్కులో దాగిన ఆధ్యాత్మిక శక్తి ఇదే!
మనిషి వ్యక్తిత్వాన్ని బయటకు చెప్పేది కేవలం ముఖం కాదు.. అతని మాట కూడా! మనసులో ప్రేమ ఉంటే మాటల్లో ఆప్యాయత కనిపిస్తుంది. కోపం, అసూయ, ద్వేషం ఉంటే అదే మాటల్లో కఠినత్వం బయటపడుతుంది. అందుకే మన పెద్దలు వాక్కును ఎంతో పవిత్రంగా భావించారు. మాటే మంత్రం.. మాటే ఔషధం అనే భావన మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో సైతం కనిపిస్తుంది.
రామాయణంలో హనుమంతుడు రామలక్ష్మణులను కలిసిన సందర్భమే దీనికి గొప్ప ఉదాహరణ. సుగ్రీవుడి ఆదేశంతో వారి వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన హనుమంతుడు ఎంతో వినయంగా, స్పష్టంగా, సంస్కారవంతంగా మాట్లాడతాడు. హనుమంతుడి మాటతీరు, ఉచ్చారణ, భావప్రకటనను శ్రీరాముడు ఎంతో ప్రశంసిస్తాడు. అంటే.. ఏం మాట్లాడుతున్నామన్నదే కాదు, ఎలా మాట్లాడుతున్నామన్నదీ కూడా మనిషి వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
