Spirituality

సూర్యచంద్రులు దేవుళ్లేనా? వారు కనిపించక పోవడంలో ఉన్న దైవ రహస్యం ఏంటి?!

ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు కేవలం ఖగోళ వస్తువులేనా? లేక వాటి వెనుక వేదాలు చెప్పే ఒక దైవిక వ్యవస్థ ఉందా? ఈ సందేహం చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా మనిషి అంతరిక్షంలోకి వెళ్లి చంద్రుడిని పరిశీలించినప్పుడు, అక్కడ చంద్రదేవుడు ఎందుకు కనిపించలేదనే ప్రశ్న సహజంగానే వస్తుంది.

అయితే మన సనాతన ధర్మంలో సూర్యుడు, చంద్రుడు అంటే మన కళ్లకు కనిపించే భౌతిక గోళాలు మాత్రమే కాదు. వాటికి అధిష్ఠాన దేవతలు ఉన్నారని వేద సంప్రదాయం చెబుతుంది. అంటే మనం చూస్తున్న భౌతిక రూపానికి వెనుక ఒక దైవిక చైతన్యం, ఒక నియంత్రణ వ్యవస్థ ఉందనే భావన. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సూర్యదేవుడైన వివస్వాన్‌కు యోగాన్ని బోధించినట్లు చెబుతాడు.