వైరల్ న్యూస్

Space Yoga: అంతరిక్షంలో వ్యోమగామి యోగా.. జీరో గ్రావిటీలో విన్యాసాలకు నెటిజన్ల ఫిదా!

శూన్యంలో తలకిందులుగా తేలియాడుతూ.. అంతరిక్ష కేంద్రం గోడలకు కాళ్లు ఆనించి ప్రశాంతంగా యోగాసనాలు వేస్తున్న దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) వ్యోమగామి సోఫీ అడెనాట్ చేసిన ఈ వినూత్న 'స్పేస్ యోగా' విన్యాసాలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.