సినిమా
Sonu Sood: దివాళీ వేళ దేవుడిలా ఆదుకున్న సోనూసూద్.. చిన్నారికి కొత్త జీవితం!
కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొచ్చి భరోసా కల్పించడంలో నటుడు సోనూసూద్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా దీపావళి పర్వదినం వేళ మరో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి దేవుడిలా ఆదుకున్నారు. తీవ్ర గుండె సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ఏడాది చిన్నారికి అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయించి పునర్జన్మనిచ్చారు.
