తెలంగాణ

SIR: ఆన్‌లైన్ మళ్లీ చేయాలా? ఫామ్ సమర్పించిన వారికి ఆన్‌లైన్ దరఖాస్తుపై క్లారిటీ!

కొత్త ఓటరు నమోదు లేదా ఓటర్ల జాబితా సవరణల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO)కి ఫిజికల్ (పేపర్) రూపంలో ఎన్యూమరేషన్ ఫామ్ (SIR ఫామ్) సమర్పించిన ఓటర్లు, ఆన్‌లైన్‌లో మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో BLOలు సేకరించిన సమాచారాన్ని వారి అంతర్గత పోర్టల్ లేదా అధికారిక యాప్ ద్వారా నేరుగా ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేస్తారు. కాబట్టి పేపర్ ఫామ్ ఇచ్చిన వారు ఆన్‌లైన్ ప్రక్రియను మళ్లీ చేయాల్సిన పనిలేదు.