International
'నోర్ముయ్.. నువ్వు ఫేక్ రిపోర్టర్..' మహిళా జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ మీడియాపై తన తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని బహిరంగంగా వెళ్లగక్కారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్ (CNN) మహిళా విలేకరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను ఉద్దేశించి ‘నోర్ముయ్, నువ్వు ఒక ఫేక్ రిపోర్టర్, మీ వార్తలే ఫేక్ న్యూస్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం చోటుచేసుకున్న ఈ సంచలన ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెట్టింట వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారితీసింది.
