అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక ఆదేశాలు
సెప్టెంబర్ 7 నుండి శాసన సభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 6న ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1గంటకు లంచ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు గులాబీ బాస్. అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై దిశానిర్దేశం చేయనున్నారు.
