కేసీఆర్‌కి ముందే చెప్పా.. రేవంత్ దూకుడు ఆపకపోతే మీరు ఇంటికే అని

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ సభలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సీఎం రేవంత్ ను ఉద్దేశించి ఎంపీ అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిది చాలా దూకుడు స్వభావం అని అన్నారు. రేవంత్ దూకుడును ఆపమని కేసీఆర్ కి ముందే చెప్పాను.. ఆపకపోతే మీరందరూ ఇంటికే అని కూడా చెప్పా అని అసద్ అన్నారు.

''రేవంత్ రెడ్డి దూకుడును కంట్రోల్ చేయండి.. లేదంటే మీరంతా ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందని నేను కేసీఆర్‌కు చాలాసార్లు చెప్పాను. సరిగ్గా అదే జరిగింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ తన దూకుడు స్వభావానికి భిన్నంగా చాలా సంయమనంతో ఉంటున్నారు. మిమ్మల్ని ఏది ఆపుతుందో నాకు తెలియదు. మళ్లీ మీ దూకుడును ప్రదర్శించండి, ప్రజల్లోకి రండి. ప్రజలు మీకు సంపూర్ణ మద్దతు ఇస్తారు'' అని అసద్ అన్నారు.

https://x.com/LutyensMediaIN/status/2095544564702671098