National
రాజీవ్ గాంధీతో అమర ప్రేమకథ.. జ్ఞాపకాలను పంచుకున్న సోనియా!
మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీతో తనకున్న అరుదైన, సుదీర్ఘమైన అనుబంధం, అనురాగాన్ని గుర్తుచేసుకుంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ అత్యంత భావోద్వేగపూర్వక పోస్ట్‌ను షేర్ చేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) లో అడుగుపెట్టిన సందర్భంగా ఆమె తన తొలి సందేశంగా ఈ జ్ఞాపకాలను పంచుకున్నారు. నవంబర్ 10న విడుదల కాబోతున్న తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకానికి సంబంధించి ఒక భావోద్వేగ వీడియోను విడుదల చేస్తూ, రాజీవ్ గాంధీతో తన 'ప్రేమ ప్రయాణం' ఎలా ప్రారంభమైందో వివరించారు.
