సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ ఘటనలపై విచారణకు ఆదేశం
అసెంబ్లీ గేటు ముందు జరిగిన రగడ, అసెంబ్లీ స్పీకర్ పై బీఆర్ఎస్ సభ్యుల వ్యాఖ్యలు, కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద దళితులు వెళ్లిన ప్రాంతాల శుద్ధి.. ఈ మొత్తం ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్ ను విచారణ అధికారిగా నియమించారు. కుల వివక్ష, అణచివేత చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. కుట్రలు చేసిన వారిని, వాటిని అమలు చేసిన వారిని కోర్టు ముందు దోషులుగా నిలబెడతామన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్.
