స్పీకర్ను గౌరవిస్తాను, ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా- ఎమ్మెల్సీ తాతా మధు
Mlc Tata Madhu: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపాయి. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల పెద్ద గొడవే జరుగుతోంది. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు. స్పీకర్ ను నేను ఏమీ అనలేదు అని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ వ్యవస్థ పట్ల, వ్యక్తిగతంగా స్పీకర్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని వెల్లడించారు. స్పీకర్ ని ఉద్దేశించి తాను ఒక్క మాట కూడా అనలేదన్నారు. నేను అనని మాటలను నాకు అపాదించడం సరైంది కాదన్నారు. ''ఒకవేళ నేను అన్న మాటల్లో ఏదైనా స్పీకర్ ను ఉద్దేశించినట్లు భావిస్తే.. ఆ మాటలు నేను ఉపసంహరించుకుంటున్నా. అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నా'' అని తాతా మధు అన్నారు.
