క్రైమ్
Shocking: నయా దోపిడి.. డబ్బుల్లేవని.. లోన్ తీయించి మరీ దోచుకున్న దొంగలు!
చేతిలో డబ్బులు లేవని ప్రాధేయపడినా ఆ కిడ్నాపర్లు కనికరించలేదు. ఏకంగా మొబైల్ లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకునేలా బలవంతపెట్టి దోచుకున్నారు. ఈ విచిత్ర దోపిడీ చెన్నైలోని పల్లికరణై (Pallikaranai) ప్రాంతంలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల అజయ్ అనే యువకుడిని నలుగురు దుండగులు ఆటోలో బలవంతంగా అపహరించి ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. అజయ్‌ను ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లిన నిందితులు డబ్బులు డిమాండ్ చేయగా, తన వద్ద చిల్లిగవ్వ లేదని అతను కన్నీరుమున్నీరయ్యాడు.
