National

సంచలనం.. టాప్ టెర్రరిస్ట్ ఇంట్లో మువ్వన్నెల జెండా రెపరెపలు!

జమ్మూ కశ్మీర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఓ అరుదైన, ఆసక్తికరమైన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. భద్రతా దళాల మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ నివాసంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి దేశభక్తిని చాటుకున్నారు. షాపియాన్‌లోని తమ ఇంట్లో తల్లి, తండ్రి ఇద్దరూ కలిసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అబిద్ రంజాన్ షేక్, లోయలో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు.