తెలంగాణ
Saroornagar: మాస్టర్ ప్లాన్‌నే మాయ చేసిన HMDA..ప్రభుత్వానికి దమ్ము లేదా?!..
హెచ్‌ఎండీఏ భూముల వేలంలో మరో అవకతవకలు వెలుగుచూశాయి. సరూర్‌నగర్ సర్వే నంబరు 9/1పి లోని స్థలాన్ని ఆన్‌లైన్‌లో వేలం వేసి రూ.71.44 కోట్ల ఆదాయం పొందిన అధికారులు.. మాస్టర్‌ప్లాన్‌నే మార్చేశారు.. 2030 మాస్టర్‌ప్లాన్‌లో 100 అడుగులుగా ఉన్న రహదారిని.. వేలం డాక్యుమెంట్‌లో మాత్రం 80 అడుగులుగా చూపించారు. రోడ్డు వెడల్పు తగ్గించి చూపడంతో బడా సంస్థలు పోటీకి దూరమై, ప్రభుత్వానికి రావాల్సిన మరింత ఆదాయానికి గండి పడిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి
