తెలంగాణ

RythuBima: బిగ్ షాక్.. ‘రైతుబీమా’కు కాంగ్రెస్ మంగళం పాడిందా?

 తెలంగాణ(Telangana)లో రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలిచిన ‘రైతుబీమా’(RythuBima) పథకం అమలుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) గత రెండు నెలలుగా బీమా ప్రీమియం సొమ్మును ఎల్‌ఐసీ(LIC)కి చెల్లించకపోవడంతో పథకం అమలు నిలిచిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రూ.5లక్షల బీమా పరిహార పథకాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.