International

నౌకపై రష్యా డ్రోన్ దాడి.. భారత నావికుడికి గాయాలు, ఇద్దరు మృతి!

 నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై రష్యా చేపట్టిన డ్రోన్ దాడి తీవ్ర కలకలం రేపింది. రొమేనియా తీర ప్రాంత సమీపంలో 'ఎంవి రోయాద్ మమ్మడోవ్' (MV Royad Mammadov) అనే కార్గో నౌకపై మంగళవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. ఈ ప్రమాదంలో నౌకలోని ఇద్దరు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒక భారత నావికుడితో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన నౌక సిబ్బందిని అత్యవసర చికిత్స నిమిత్తం రొమేనియాలోని ఆసుపత్రికి తరలించారు.