వ్యాపారం
డాలర్‌తో పోలిస్తే రూపాయి జోరు.. ఒక్కరోజే 25పైసలు బలోపేతం!
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ కోలుకుని ఊపందుకుంది. సోమవారం ఉదయం జరిగిన ఫారెక్స్ ట్రేడింగ్‌లో రూపాయి ఒక్కరోజే 25 పైసలు బలపడి 93.68 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదు కావడం, దేశీయ మార్కెట్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (FPIs) భారీగా ప్రవహించడం, పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు సద్దుమనుగుతాయనే ఆశాభావం రూపాయికి బలమైన రక్షణగా నిలిచాయి.
