వైరల్ న్యూస్

అస్ట్రేలియాలో భారత విద్యార్థినికి షాక్!

ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఓ భారతీయ విద్యార్థినికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. కేవలం కొద్ది నిమిషాల పాటు వేడినీటితో స్నానం చేసినందుకు స్థానిక అగ్నిమాపక నిబంధనల ప్రకారం ఏకంగా 1,900 ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1.3లక్షలు) జరిమానా రూపంలో చెల్లించాల్సి వచ్చింది. తనతో పాటు విదేశాల్లో ఉండే విద్యార్థులను అప్రమత్తం చేసేందుకు ఆమె స్వయంగా ఈ వింత అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఈ వార్త నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. సిడ్నీ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న వమిక అనే భారతీయ విద్యార్థిని ఇటీవల తన గదిలో వేడినీటితో స్నానం చేసింది.