తెలంగాణ

ఈసీ మోసం వల్లే ఆర్జేడీ, టీఎంసీ పార్టీల ఓటమి : టీపీసీసీ చీఫ్

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాల వైఖరితో దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందన్నారు.ప్రపంచ దేశాలలు భారత్ తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ సర్కార్ సూచనలతో ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ బీజేపీకి తొత్తుగా మారి, నిష్పాక్షికతను వదిలేసి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ తీరుతో ఓటర్ల భవిష్యత్ రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నికల నిర్వహణ మ్యానిపులేట్ అయ్యేలా జరుగుతోందని విమర్శించారు.