వైరల్ న్యూస్
అమెరికాలో పెరుగుతున్న తెలుగు వారి ఎఫైర్స్.. మహిళ వీడియో వైరల్!
అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైల వివాహేతర సంబంధాల గురించి ఓ మహిళ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీడియో విడుదల చేసింది.అది కాస్త వైరల్ అవుతోంది. ఇండియాలో పద్ధతిగా ఉన్న కుటుంబ విలువలు అమెరికాకు వచ్చాక దిగజారిపోతున్నాయని,ముఖ్యంగా పెళ్లయిన మహిళలే అధికంగా పెళ్లికాని యువకులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారని సదరు వీడియోలో ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలోని డల్లాస్లో తెలుగు కమ్యూనిటీ ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎన్నారైల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఇండియా నుంచి వచ్చిన వారు ఉద్యోగాలు, చదువుల్లో రాణిస్తున్నప్పటికీ వారు అవలంభిస్తున్న కొన్ని విధానాలు మొత్తం తెలుగు కమ్యూనిటీకి చేటు చేసేలా ఉన్నాయని సదరు మహిళ వీడియోలో ప్రస్తావించింది.
