తెలంగాణ
రిమ్స్ ఘటన.. సీఎం రేవంత్ రూ.50లక్షలు ఫైన్ కట్టాలి
Kavitha: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యలేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రోజులు కూడా నిండని పసిపిల్లలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న జిల్లాలో ఇంత హృదయ విదాకరమైన సంఘటన జరిగితే వచ్చి చూసే తీరిక లేదా అని ప్రశ్నించారు.
ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది గానీ మైనార్టీ, ఆదివాసీ చిన్నారులు చనిపోతే వచ్చి చూసే తీరిక లేకుండా పోయిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగిన ఎస్ఎన్ సీయూను బుధవారం కల్వకుంట్ల కవిత పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును హాస్పిటల్ సిబ్బందిని, చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులను అడిగి తెలుసుకున్నారు.
