తెలంగాణ
TG: బండి సంజయ్ తో కలిసి అభివృద్ధిలో పనిచేస్తున్నా : సీఎం రేవంత్
TG: రాజకీయాలు ఎన్నికల వరకేనని, రాష్ట్ర ప్రగతి కోసం ప్రత్యర్థి పార్టీ నేతలతో సైతం కలిసి పనిచేసేందుకు రెడీ అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్‌తో కలిసి తాను తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు రేవంత్ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.కరీంనగర్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఎలాంటి సంకుచిత రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు
