తెలంగాణ

రేవంత్ ఓటుకు నోటు దొంగ.. జాక్‌పాట్ సీఎం : కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. హామీల అమలుపై ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తుందంటూ కేటీఆర్ మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లోని అంబేడ్కర్ మినీ స్టేడియంలో నిర్వహించిన ‘జెన్ జీ’ సభకు హాజరైన కేటీఆర్..రేవంత్ సర్కారు ప్రభుత్వ విధానాలు, పాలన తీరుపై విరుచుకపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరిట 24 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో యూత్ డిక్లరేషన్ అమలు చేస్తామని అన్నారని, 1000 రోజులు అయింది ఏం చేశారని ప్రశ్నించారు. బకాసురులులాగా తింటున్నారు, కుంభకర్ణుల్లా పండుకుంటున్నారు, పంది కొక్కుల్లా తింటున్నారు.. అది తప్ప కాంగ్రెస్ వాళ్లు చేసింది ఏమీ లేదన్నారు.