సినిమా
ప్రముఖ గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూత!
తమిళ సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ సీనియర్ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి (75) క్యాన్సర్, వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తన సుదీర్ఘమైన స్వర్ణోత్సవ సంగీత ప్రయాణంలో కృష్ణరాజ్ దాదాపు 3వేలకు పైగా భక్తి, ప్రైవేటు పాటలు ఆలపించగా, అందులో 300కు పైగా సూపర్ హిట్ సినీ గీతాలు ఉన్నాయి. తన ప్రత్యేకమైన కంఠస్వరంతో, ముఖ్యంగా ఫోక్ (జానపద), మాస్ ఉత్సాహభరితమైన పాటలతో కొన్ని దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీత అభిమానులను ఆయన విశేషంగా అలరించారు
