రియల్ హీరో.. భారతీయ పైలట్‌పై ట్రంప్ ప్రశంసలు!
ఘోర విమాన ప్రమాదం సంభవించకుండా భారత పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమామాన్ని కూల్చివేసేందుకు యత్నించిన ఒమన్ దేశానికి చెందిన కో పైలట్ చర్యలను అడ్డుకుని 180 మంది ప్రాణాలను రక్షించాడు. కాక్‌పిట్‌లో ఉన్న కో పైలట్ ఆగ్రహంతో భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై కత్తితో దాడి చేశాడు. పలుమార్లు ముఖం, చేతులపై దాడికి పాల్పడటంతో పాటు విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ భారత పైలట్ అతడితో పోరాడి సేఫ్ గా విమానం ల్యాండ్ చేశాడు. దీంతో ఆయనకు ప్రముఖులు అభినందనలు తెలిపారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ‘రియల్ హీరో’ అని కొనియాడారు. ‘ధైర్యవంతుడైన మచ్చార్‌పై ఉగ్రవాది దాడి చేశాడు.అయినా ప్రాణాలకు తెగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పైలట్ పరిస్థితి విషమంగా ఉన్నా, అద్భుతమైన సమయస్పూర్తితో వ్యవహరించి ఒకరకంగా హీరోగా నిలిచారు’ అని పేర్కొన్నారు.
