వ్యాపారం
బాంబు పేల్చిన ఆర్బీఐ.. పెరగనున్న రుణాల వడ్డీ రేట్లు!
సామాన్యులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో అల్లాడుతున్న ప్రజలపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) మరో భారం మోపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు ఇంతకాలం తటస్థంగా ఉండగా, ఇప్పుడు పెరగనున్నాయి. చాలిచాలనీ వేతనాలతో నెట్టుకొస్తున్న మధ్యతరగతి, పేదప్రజలకు తాజా ఆర్బీఐ నిర్ణయం పెనుభారంగా మారనుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో 3 రోజుల పాటు జరిగిన ఎంపీసీ ద్వైమాసిక సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం ఉదయం వెల్లడించారు. మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగా ‘రెపో రేటు’ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 5.25 శాతంగా ఉన్న రెపోరేటు 5.5 శాతానికి పెరిగింది.
