National
దేశమంతా రక్షాబంధన్ వేడుకలు.. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు!
తోబుట్టువుల మధ్య ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను దేశవ్యాప్తంగా శుక్రవారం (ఆగస్టు 28) అత్యంత వైభవంగా నిర్వహించారు. సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రక్షా సూత్రాలు కట్టి వారి శ్రేయస్సును ఆకాంక్షించగా, సోదరులు వారికి రక్షణగా ఉంటామని మాట ఇస్తూ బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినులు పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆత్మీయంగా రాఖీలు కట్టారు.
