National

ఫారమ్ -6‌పై రాహుల్ గాంధీ అబద్ధాలు.. తెలంగాణ సీఈవో ఫ్యాక్ట్‌చెక్ క్లారిటీ

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఫారమ్-6లో ఏకపక్షంగా మార్పులు చేసి కేంద్రంలోని మోడీ సర్కారుకు మేలు జరిగేలా సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు తీసుకున్నారని.. అందుకే ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై తెలంగాణ సీఈవో సుదర్శన్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన పోస్టును తోసిపుచ్చిన సీఈవో.. ఫారమ్-6 డిక్లరేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ప్రతి నిర్ణయం కమిషన్ పూర్తి ఆమోదంతో పాటు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడే జరిగిందని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. బిహార్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం 2025 జూన్ 24న జారీచేసిన ఆదేశాలను ఎన్నికల సంఘం సభ్యులు అందరి ఏకగ్రీవ ఆమోదంతోనే అమలు చేసిందన్నారు.