తెలంగాణ
TG: తమ్మిడి కుంట వద్ద రాహుల్, రేవంత్ మార్నింగ్ వాక్.. రేపు ఉదయం స్పెషల్ షెడ్యూల్!
TG: లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 'భారత్ సమ్మిట్' ముగింపు వేడుకతో పాటు 'గిగ్ వర్కర్స్ చట్టం' ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఆయన పర్యటన ఫిక్స్ అయ్యింది. ఈ బిజీ షెడ్యూల్లో భాగంగానే, రేపు (నవంబర్ 14) ఉదయం హైటెక్ సిటీ సమీపంలోని తమ్మిడి కుంట వద్ద సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీ మార్నింగ్ వాక్ చేయనుండటం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ, సుందరీకరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐటీ కారిడార్‌కు కూతవేటు దూరంలో ఉన్న తమ్మిడి కుంటను సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి సందర్శించనున్నారు.
