వైరల్ న్యూస్
సౌండ్ ఎక్కువ పెట్టాడని.. పూజారిపై పిడిగుద్దులు
ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో లౌడ్ స్పీకర్ వాడకం వలన కొందరు చిరాకు పడుతున్నట్టు తెలుస్తోంది. వినాయక చవితి నిమజ్జనాల సమయంలో డీజే శబ్దాలకు కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. రాత్రింబవళ్లు డీజే సౌండ్స్ వలన చిన్నారులు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడినట్టు ఫిర్యాదులు వచ్చాయి. గుండె జబ్బులు ఉన్న వారైతే డీజే సౌండ్స్‌కు దూరంగా రాత్రులు గడిపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లౌడ్ స్పీకర్లో భక్తి సాంగ్స్ పెట్టాడని, సౌండ్ తగ్గించడం లేదని ఇద్దరు వ్యక్తులు ఓ పూజారిని చితకబాదారు. పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన రాజస్థాన్ జైపూర్‌లోని గణేశ్‌నగర్ మెయిన్ రోడ్ వద్దగల శివాలయంలో చోటుచేసుకుంది. పెద్ద సౌండ్‌తో పండిట్ రామకృష్ణ భక్తి పాటలు పెట్టడమే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది.
