తెలంగాణ

ఫలించిన పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం.. జీవో 97పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం!

 తెలంగాణలో కొంతకాలంగా ఉత్కంఠ రేకెత్తించిన పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలకు ప్రభుత్వం ముగింపు పలికింది. పాలిటెక్నిక్ కళాశాలలను కార్మిక, ఉపాధి శాఖ (శక్తి విభాగం) పరిధిలోకి మారుస్తూ గతంలో జారీ చేసిన వివాదాస్పద జీవో నంబర్ 97 (G.O. Ms. No. 97) పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విద్యార్థులు, అధ్యాపకుల అభ్యర్థనలు, ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు ఆ జీవోను సవరిస్తూ తాజాగా జీవో నంబర్ 157 (G.O. Ms. No. 157) ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.