తెలంగాణ

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్‌ నాయకత్వం కుట్ర

Cm Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్ నాయకత్వం కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంపై గుజరాత్ ఆధిపత్యాన్ని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. కేంద్రం తనను అడ్డుకున్నా, తన లక్ష్యాన్ని మాత్రం అడ్డుకోలేదని అన్నారు. డిసెంబర్​లో ఫ్యూచర్​ సిటీలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్​లో పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తామన్నారు. తన విదేశీ పర్యటనలో ఎలాంటి గోప్యతా లేదని, మొత్తం షెడ్యూల్​ను విదేశాంగశాఖ ముందుంచామన్నారు. లండన్​ పర్యటన ముగించుకుని హైదరాబాద్​ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్రం, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.