బ్రిక్స్ దేశాలే రూల్స్ సెట్ చేసుకోవాలి.. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు
PM Modi: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత మండపం వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ వార్షిక సదస్సు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచ దేశాల అధినేతల సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ముందే పరోక్షంగా చైనా అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ మోడీ చేసిన కామెంట్స్ దౌత్య వర్గాల్లో సంచలనంగా మారాయి.ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ నుంచి సోలార్ ప్యానెల్స్ వరకు అత్యంత కీలకమైన 'అరుదైన ఖనిజాల' ప్రాసెసింగ్‌లో చైనా ఏకఛత్రాధిపత్యం (దాదాపు 90 శాతం) చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. వీటి సరఫరాను ఆయుధంగా మలుచుకుని ఇతర దేశాలను ఒత్తిడికి గురిచేసే ధోరణిని మోడీ తీవ్రంగా తప్పుబట్టారు. "అత్యాధునిక సాంకేతికతను, సంక్లిష్ట ఖనిజాలను అడ్డం పెట్టుకుని ఇతరులను బెదిరించే చర్యలను ప్రపంచం ముక్తకంఠంతో వ్యతిరేకించాలి.
