PF : డబ్బు ఎన్ని సార్లు తీసుకోవచ్చు? కొత్త రూల్స్ ఇవే!
PF: ఉద్యోగులకు ఉపయోగపడేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) నుంచి డబ్బు తీసుకునే నిబంధనలను తాజాగా EPFO మరింత సింపుల్ చేసింది. గతంలో వివిధ అవసరాలకు వేర్వేరు రూల్స్ ఉండటంతో ఉద్యోగులు క్లెయిమ్ చేసే టైంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు 13 రకాల రూల్స్‌ను మూడు ప్రధాన కేటగిరీలుగా మార్చారు. దీంతో హెల్త్, స్టడీ, మ్యారేజ్, హోమ్ వంటి అవసరాలకు PF అడ్వాన్స్ తీసుకోవడం మరింత సింపుల్‌గా మారింది.ఎంప్లాయ్ లేదా కుటుంబ సభ్యుల స్టడీ అవసరాల కోసం మొత్తం 10 సార్లు PF అడ్వాన్స్ తీసుకునే అవకాశం కల్పించారు.
పెళ్లి ఖర్చులకు 5 సార్లు
తన వివాహం లేదా కుటుంబ సభ్యుల వివాహ అవసరాల కోసం మొత్తం 5 సార్లు PF నుంచి అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఇంతకుముందు మ్యారేజ్, స్టడీ కలిపి ఉన్న పరిమితిని ఇప్పుడు వేర్వేరుగా మార్చారు.
ఇల్లు కొనాలన్నా.. కట్టుకోవాలన్నా
ఇల్లు లేదా స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణం, హోమ్ లోన్ చెల్లింపు, ఇంటి మరమ్మతులు వంటి అవసరాల కోసం కూడా PF అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈ కేటగిరీలో మొత్తం 5 సార్లు డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
